- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వేళ భయపెడుతున్న ‘R’ వాల్యూ.. దాని గురించి మీకు తెలుసా..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంటే సీసీఎంబీ మాత్రం ‘R’ వాల్యూ పెరిగితే కష్టమేనంటూ హెచ్చరిస్తోంది. దీంతో ఎక్కడ చూసినా ‘R’ వాల్యూ అంటూ వింటున్నాం. అసలు ఈ ‘R’ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ‘R’ అంటే రీప్రొడక్టివిటి. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే విధానం. కరోనా బారిన పడిన వ్యక్తి మరొకరికి ఇన్ఫెక్ట్ చేయగలిగితే అప్పుడు దాన్ని రీ ప్రొడక్టివిటీ(ఆర్ వాల్యూ) 1గా పరిగణిస్తారు.
ఓ ప్రాంతంలో ముందుగా కరోనా సోకిన వారిని గుర్తించి జీరో ‘ఆర్’ వాల్యూ గా తీసుకొని టెస్టు, ట్రాక్ విధానంతో వీరి ద్వారా ఇంకా ఎంతమందికి ఇన్ఫెక్ట్ చేశారో గుర్తించి సంబంధిత ప్రాంతంలో ‘ఆర్’ వాల్యూని తెలుసుకుంటారు. ‘ఆర్’ వాల్యూ తక్కువగా ఉంది అంటే ఇన్ఫెక్టివిటీ రేటు తక్కువగా ఉందని అర్థం. ఒకవేళ కేసులు పెరుగుతుందంటే అది ఆ ప్రాంత ప్రజల రోగనిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. వైరస్ మ్యుటేషన్ పై ఆధారపడి ఉంటుంది. ఇది ఓ చదరపు కిలోమీటర్‌లో నివసించే ప్రజల సంఖ్య పై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎక్కువ జనాభా ఉండే పట్టణాల్లో అధికంగా, పల్లెల్లో తక్కువగా వైరస్ వ్యాప్తి ఉంటుంది. ప్రభుత్వాలు కూడా వ్యాప్తిని తగ్గించేందుకు వివిధ చర్యలు తీసుకుంటారు.
‘ఆర్’ వాల్యూ పెరిగినపుడల్లా వేవ్‌గా ప్రభుత్వాలు గుర్తిస్తాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ‘ఆర్’ వాల్యూ 1 కంటే తక్కువగానే ఉంది. కేరళలో మాత్రం ‘ఆర్’ వాల్యూ 1 కంటే చాలా ఎక్కువగా ఉందని, అందుకే దేశంలో నమోదయ్యే కేసుల్లో 40 శాతం కేసులు అక్కడే ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉందని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం కరోనా డెల్టా వేరియంట్ భయాందోళనలకు గురిచేస్తోంది. దేశంలో తిరిగి కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని పండగలు, ఉత్సవాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించండని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.