అంతవరకూ ఐక్య ఉద్యమం ఆగదు

by  |
అంతవరకూ ఐక్య ఉద్యమం ఆగదు
X

దిశ, దుబ్బాక: సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు బ్యాగరి నర్సింలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆత్మహత్యకు బాధ్యులైన నిందితులు సర్పంచ్, తహసీల్దార్, వీఆర్ఓలను అరెస్టు చేసేవరకూ దళిత సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో.. ఐక్య ఉద్యమం చేస్తామని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు. గురువారం ఆయన మిరుదొడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ..

దళిత రైతు నర్సింలు కుటుంబానికి వున్న పదమూడు గుంటల భూమిలో ప్రభుత్వం బలవంతంగా రైతు వేదిక భవన నిర్మాణానికి గుంజుకోవడంతో ఎలా బతకాలని, వాయిస్ రికార్డు చేసి విషం తాగి మరణించడం బాధాకరమన్నారు. నిందితులలో సర్పంచ్ పాపిరెడ్డి కేసు పెట్టినప్పటికీ అరెస్టు చేయలేదన్నారు. వీఆర్‌ఓ, తహసీల్దారులపై సైతం ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, భాధిత కుంటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఇప్పటికే జిల్లా కలెక్టర్, గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నా చేసి, గజ్వేల్ ఏసీపీకి వినతిపత్రం సమర్పించారు.



Next Story

Most Viewed