- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు. స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఆడటానికి ముందు విదేశాల్లో అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడిగా బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు. 2018లో దక్షిణాఫ్రికాలో టెస్టు అరంగేట్రం చేసిన బుమ్రా.. ఆ తర్వాత మ్యాచ్‌లన్నీ విదేశీ గడ్డపైనే ఆడాడు. మొత్తం 17 టెస్టులు ఆడిన బుమ్రా.. వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ గంగ సరసన చేరాడు. డారెన్ గంగా కూడా కరేబియన్ దీవుల్లో ఆడక ముందు 17 టెస్టులు విదేశాల్లోనే ఆడాడు. శుక్రవారం నుంచి చెన్నైలో ఇంగ్లాండ్ జట్టుతో ప్రారంభమైన టెస్టే బుమ్రాకు తొలి హోం గ్రౌండ్ టెస్టు. భారత క్రికెటర్లలో జవగళ్ శ్రీనాథ్(12), ఆర్పీ సింగ్(11), సచిన్ టెండుల్కర్(10) కూడా విదేశాల్లో మ్యాచ్‌లు ఆడిన తర్వాతే ఇండియాలో తమ తొలి టెస్టు ఆడారు. కాగా, బుమ్రా 17 టెస్టుల్లో 79 వికెట్లు తీశాడు. ఇండియాలో తొలి టెస్టు ఆడుతన్న బుమ్రా.. డాన్ లారెన్స్ వికట్ తీయడం ద్వారా బోణీ కొట్టాడు.