శానిటైజర్లు వద్దు.. వేడి నీళ్లు ముద్దు

by  |
శానిటైజర్లు వద్దు.. వేడి నీళ్లు ముద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నివారణ కోసం శానిటైజర్లు, మాస్క్ తప్పనిసరి అన్న కేంద్ర ఆరోగ్యశాఖ నూతన సూచనలు చేసింది. వేడి నీళ్లు తాగడం, సబ్బుతోనే చేతులు కడుక్కోవాలని సూచించింది. తరచూ శానిటైజర్లు వినియోగించడం ప్రమాదమని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కే వర్మ హెచ్చరించారు.

భారత్‌లో కరోనాతో ఇది వరకు లేని విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయని ఆర్కే వర్మ గుర్తు చేశారు. వైరస్ ఇంతగా విజృంభిస్తోందని ప్రపంచ దేశాలు ఊహించలేదని అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా నివారణ కోసం తరచూ శానిటైజర్లు ఉపయోగించడం ద్వారా చర్య వ్యాధుల వస్తాయని చెప్పారు. దీనికి బదులు వేడి వేడి నీళ్లతో శుభ్రం చేసుకోవడం, వేడి నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు పాటించాలని ఆర్మే వర్మ వివరించారు.


Next Story

Most Viewed