కంగనా రనౌత్‎కు కేంద్రమంత్రి మద్దతు..!

by  |
కంగనా రనౌత్‎కు కేంద్రమంత్రి మద్దతు..!
X

దిశ వెబ్‎డెస్క్: నటి కంగనా రనౌత్‌కు కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత రాందాస్ అథవాలే మద్దతుగా నిలిచారు. ముంబైను పాక్ అక్రమిత కశ్మీర్‎తో పోల్చేలా వ్యాఖ్యలు చేసిన కంగనాను ముంబై తిరిగి రావద్దంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. సంజయ్ రౌత్ తనకు మంచి మిత్రుడు అయినప్పటికీ, కంగనాను బెదిరించడం సరి కాదన్నారు రాందాస్ అథవాలే. సుశాంత్ సింగ్ రాజ్‎పుత్‎కు న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తున్న కంగనాకు, ఆమె కుటుంబానికి తామంతా అండగా నిలుస్తామని అన్నారు.


Next Story

Most Viewed