పేదలకు అధికారులు సహకరించాలి

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద ప్రతీ పేద కుటుంబం సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు అధికారులు, బ్యాంకులు, పూర్తి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కవాడిగూడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లక్షకు పైగా ఆవాస్ యోజన దరఖాస్తులు , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిశీలించి అర్హులకు రుణాలు ఇప్పించి గృహ నిర్మాణం జరిగేలా చూడాలని సూచించారు.

Advertisement