కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు కరోనా

by Anukaran |   ( Updated:2020-08-04 08:30:03.0  )
dharmendra pradhan
X

న్యూఢిల్లీ : కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చేరారు. ప్రధాన్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ రాగానే ఆయన ఐసొలేషన్‌లోకి వెళ్లారు.

తాజాగా, పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కరోనా పాజిటివ్ రావడంతో మేదాంత ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. షా చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా చేరారు.

Advertisement

Next Story

Most Viewed