కరోనా కష్టకాలంలో.. ఆర్టీసీని ఆదుకోవాలని

by  |
కరోనా కష్టకాలంలో.. ఆర్టీసీని ఆదుకోవాలని
X

దిశ, ముషీరాబాద్: కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీని ఆదుకోవాలని, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ.. మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సులను నడపని కారణంగా ఆర్టీసీ ఆదాయం పూర్తిగా పడిపోయిందన్నారు. రెండు నెలల పాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఆర్టీసీలోని 49 వేల మందికి మూడు నెలలు 50 శాతం మాత్రమే జీతాలు చెల్లించారని తెలిపారు. సీఎం కేసీఆర్ మే 19 నుంచి సిటీ బస్సులు, అంతర్ రాష్ట్ర బస్సుల మినహా జిల్లాలో బస్సు తిప్పాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా నాటి నుంచి బస్సులు తిరుగుతున్నటికీ కరోనా భయంతో బస్సుల్లో వెళ్లడానికి ప్రయాణికులు జంకుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బస్సులు నడపడం లేదని, వచ్చిన ఆదాయం డీజిల్ ఖర్చులకే సరిపోవడం లేదని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్లల్లో రవాణా రంగానికి కేటాయింపులు చేయకపోవడంపై విచారo వ్యక్తం చేశారు. అప్పుగా తీసుకువచ్చిన రూ.600 కోట్ల నుంచి ఆర్టీసీ యాజమాన్యం నేటివరకూ జీతాలు చెల్లించలేదన్నారు. తెచ్చిన రూ.600 కోట్లు అయిపోయినందున ఈ నెల జీతాలు ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉందన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రియంబర్స్‌మెంట్ డబ్బులు వెంటనే చెల్లించి, ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఈ నెల జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed