కిరణ్ బేడికి షాక్.. లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగింపు

by Shamantha N |   ( Updated:2021-02-16 11:27:39.0  )
కిరణ్ బేడికి షాక్.. లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్‌గా కొనసాగుతున్న తమిళి సై ఇకనుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నిర్ణయం తీసుకున్నట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ మంగళవారం రాత్రి వెల్లడించింది. కాగా.. 2016 మే 22న కిరణ్‌ బేడిని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story