- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు: సంజీవ రెడ్డి
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఐఎన్ టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి సంజీవ రెడ్డి మండిపడ్డారు. కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ కేంద్రం సవరణలు చేస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ దేశోద్ధారక భవన్‌లో మంగళవారం తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ , హాకర్స్ ట్రేడ్ యూనియన్ సర్వ సభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ… కార్మికుల జీవన నాణ్యతను పెంచడానికి బదులు శ్రమ దోపిడిని కేంద్రం తీవ్రతరం చేస్తోందన్నారు.
పెట్టుబడిదారులకు లాభాలను ఆర్జించి పెట్టడమే ధ్యేయంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ లైన రైల్వే, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ , బ్యాంకులు , రక్షణ,బొగ్గు , విద్యుత్ , మార్కెట్ యార్డు వంటి వాటిని కార్పొరేట్ శక్తులకు అమ్ముకోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.