ఆ రెండు నగరాల్లో మల్టీ లాజిస్టిక్ పార్క్‌లు

by Shamantha N |
ఆ రెండు నగరాల్లో మల్టీ లాజిస్టిక్ పార్క్‌లు
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్, కోయంబత్తూరులో మల్టీ లాజిస్టిక్ పార్క్(ఎంఎల్‌పీ) ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పార్కుల డీపీఆర్ బాధ్యతను నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌‌హెచ్ఏఐ)కు కేంద్రం అప్పగించింది. దేశంలోని 21 ప్రాంతాల్లో ఫీజిబిలిటీ స్టడీస్ చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. నిర్ణీత ప్రాంతాలకు సరకును పంపేలా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులో సౌకర్యాలు కల్పించనున్నారు. ఎంఎంఎస్‌పీలోనే ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన అనుమతులు ఇవ్వనున్నారు. ఎంఎల్‌పీలోనే ధ్రువీకరణ ఇచ్చే కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఎంఎల్‌‌పీలోనే గోదాములు, శీతల గిడ్డంగులు, ఇతర వనరుల ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed