అలా అయితేనే మద్దతు ధరపై పరిశీలిస్తాం: కేంద్రం

by Shamantha N |   ( Updated:2020-12-30 10:24:15.0  )
అలా అయితేనే మద్దతు ధరపై పరిశీలిస్తాం: కేంద్రం
X

దిశ,వెబ్‌డెస్క్: కేంద్రంతో రైతు సంఘాల చర్చలు బుధవారం ముగిశాయి. రైతుల రెండు డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది. జనవరి 4న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల అభ్యంతరాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లులో రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య ఆర్డినెన్స్‌లో శిక్ష, జరిమానాల నుంచి రైతులను మినహాయిస్తూ సవరణలు చేయనున్నట్టు చెప్పింది. సాగు చట్టాలను రద్దు చేసేందుకు కేంద్రం అంగీకరించలేదు. ఆందోళనలు విరమిస్తేనే కనీస మద్దతు ధరను పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది.

Advertisement

Next Story