ఆ విషయంపై… నేడు రాజ్యసభలో కీలక ప్రకటన

దిశ, వెబ్‌‌డెస్క్: భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ వ్యాలీలో సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుని, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. గతంలో ఇరు దేశాల నాయకత్వం తీసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను చైనా ఉల్లంఘించిన కారణంగా ఈ సరిహద్దు సమస్య తలెత్తిన సంగతీ తెలిసిందే. కాగా దీనిపై స్పష్టత ఇవ్వాలని ఇటీవల లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ గురువారం రాజ్యసభ సమావేశాల్లో మధ్యాహ్నం 12 గంటలకు కీలక ప్రకటన చేయనున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సభకు వివరించనున్నారు. అంతేగాకుండా సందేహాలున్న ఎంపీలు లేవనెత్తిన అంశాలపై కూడా వివరణ ఇవ్వనున్నారు.

Advertisement