- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిద్రపోతున్న దంపతులను నరికిన దుండగులు
by Shyam |

X
దిశ నాగార్జునసాగర్ : ఆరుబయట నిద్రిస్తున్న దంపతులను దారుణంగా నరికి చంపిన ఘటన దేవరకొండ నియోజక వర్గం నేరుడుగొమ్ము మండలం బుగ్గతండాలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతులు బుల్లి, నేనావత్ సోమాని గా గుర్తింపు. ఆదివారం రాత్రి వారు తమ ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిని హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, దంపతుల హత్యకు భూవివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Next Story