నడిరోడ్డుపై పసిపాప.. ఎక్కడంటే !

దిశ, వెబ్‌డెస్క్: ఏ తల్లి నవమాసాలు మోసిందో ఏమో తెలియదు కానీ అప్పుడే పుట్టిన పసికందును హైదరాబాద్‌లో నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. సోమవారం కోఠి సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వాస్పత్రి వద్ద రోడ్డుపై శిశువు అరుపులు విన్న జీహెచ్ఎంసీ కార్మికురాలు అక్కున చేర్చుకొని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులకు ఫోన్ చేసి శిశువును అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

Advertisement