దేశవాళీ క్రికెట్ పై ఆరోపణలు.. బీసీసీఐ ఏమన్నదంటే..?

by Shyam |   ( Updated:2021-07-20 08:42:50.0  )
sports news
X

దిశ, స్పోర్ట్స్: డబ్బులు తెచ్చి పెడుతుందనే ఐపీఎల్ నిర్వహించి.. దేశవాళీ క్రికెట్ 2020 సీజన్ మాత్రం రద్దు చేశారని బీసీసీఐపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బోర్డు కార్యదర్శి జై షా స్పందించారు. 60 మ్యాచ్‌లు నిర్వహించడానికి, 2 వేలకు పైగా మ్యాచ్‌లను నిర్వహించడానికి చాలా తేడా ఉంటుందని జై షా అన్నారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించారు. అదే సమయంలో రంజీ సీజన్ మొత్తం రద్దు చేశారు. దేశవాళీ క్రికెట్‌లో 2 వేలకు పైగా మ్యాచ్‌లు దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో నిర్వహించాల్సి ఉంటుంది. కరోనా వల్ల అది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఐపీఎల్‌లో కేవలం 60 మ్యాచ్‌లే ఉంటాయి కాబట్టి దాన్ని యూఏఈలో నిర్వహించామని జై షా చెప్పుకొచ్చారు. దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నామని వస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ప్రపంచంలోనే పటిష్టమైన దేశవాళీ క్రికెట్ మన దేశంలోనే ఉన్నదని ఆయన అన్నారు.

Advertisement

Next Story