ఉద్యోగం.. సద్యోగంలేదు!

by  |
ఉద్యోగం.. సద్యోగంలేదు!
X

ద్యోగమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రభుత్వం ఇద్దామన్నా పరిస్థితి అనుకూలంగా లేదు. ఇది ఆర్థికవ్యవస్థ మందగమనం చూపిస్తున్న ప్రభావం. దేశంలో నిరుద్యోగిత రేటు పెరగడం చూస్తుంటే భవిష్యత్తు మరెంత దారుణంగా ఉంటుందో ఊహించవచ్చు. 2019 సెప్టెంబర్-డిసెంబర్ కాలంలో భారత నిరుద్యోగిత రేటు 7.5 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) సోమవారం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. విద్యావంతులైన యువతలో నిరుద్యోగిత రేటు మరింత ఘోరంగా ఉందని, ఇది 60 శాతాం పైగా పెరిగిందని తెలిపింది. 2019లో డిగ్రీలు తీసుకున్న యువతకు ఆ ఏడాది చెత్త సంవత్సరంగా నివేదిక అభిప్రాయపడింది.

2017 మే-ఆగష్టులో నిరుద్యోగిత రేటు 3.8 శాతంగా ఉంది. ఆ ఏడాది నుంచి ప్రతి ఏడు నిరుద్యోగిత రేటు పెరుగుతూనే ఉంది. అలా వరుసగా ఏడేళ్లు నిరుద్యోగిత రేటు పెరగిందని నివేదిక పేర్కొంది. దాదాపు 1,75,000 ఇళ్లల్లో చేసిన సర్వే ప్రకారం… గ్రామీణ భారతదేశంలో నిరుద్యోగిత రేటు పట్టణ నిరుద్యోగిత కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం గ్రామీణ నిరుద్యోగిత 9 శాతంగా ఉంది. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా, పట్టణ నిరుద్యోగుల సంఖ్య జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. గ్రామీణ భారతదేశంలో 2019 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య నాలుగు నెలల వ్యవధిలో నిరుద్యోగిత రేటు 6.8 శాతంగా ఉంది. గ్రామీణ నిరుద్యోగిత రేటు తక్కువ ఉండటం వల్ల మొత్తం దేశ నిరుద్యోగిత రేటుపై ఆ ప్రభావం ఉంటుంది. దీనివల్ల దేశ నిరుద్యోగిత రేటు పెరగకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి నాణ్యత లేనిదని నివేదిక తెలిపింది.


పట్టణ యువతలో ప్రధానంగా విద్యావంతులైన వారిలో నిరుద్యోగిత రేటు చాలా ఎక్కువగా ఉండనే విషయాన్ని నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. 20 నుంచి 24 వయసు కలిగిన యువత నిరుద్యోగిత రేటు 37 శాతం ఉండగా, వారిలో గ్రాడ్యూయేట్‌లు 60 శాతానికి పైగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. 2019 ఏడాదిలో గ్రాడ్యూయేట్ల నిరుద్యోగిత రేటు 63.4 శాతంగా ఉంది. నివేదిక ఇచ్చిన వివరాల ప్రకారం..గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత 2016లో 47.1 శాతం ఉండగా, 2017లో 42 శాతం ఉంది. 2018లో 55.1 శాతం ఉండగా, 2019లో అది మరింత క్షీణించింది. 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు 42.8 శాతం ఉంది. ఇది అతిపెద్ద సవాలు. మరో ప్రధాన సమస్య ఏంటంటే, అన్ని వయసుల గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు 18.5 శాతం ఉండటం. ఇదే ధోరణి, పోస్ట్ గ్రాడ్యుయేట్ల విషయంలోను ఉంది. 2016లో పోస్ట్ గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు 24.6 శాతంగా ఉందేది. 2017లో 25.4 శాతానికి పెరిగి, 2018లో 22.3 శాతానికి దిగింది. అయితే, 2019లో మళ్లీ 23 శాతానికి పెర్గింది.

ఈ నివేదికలో, 20 నుంచి 24 ఏళ్ల వయసున్న వారికి సరైన ఉపాధి అవకాశాలు దొరకట్లేదని స్పష్టం చేసింది. వీరి నిరుద్యోగిత రేటు 2017 మే-ఆగష్టులో 17 శాతం ఉండగా, 2019 సెప్టెంబర్-డిసెంబర్ నాటికి 37 శాతనికి పెరిగింది. 15 నుంచి 19 ఏళ్ల వయసున్న వారి నిరుద్యోగిత రేటు 45 శాతంగా ఉంది. అయితే, ఈ వయసు వారు ఉద్యోగాల కోసం వెతికే సమయం కాదు. చదువుకోవాల్సిన వయసు వారిది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగాల కోసం చూస్తూన్నట్లయితే వారికి సైతం ఉపాధి దొరకడం కష్టంగా ఉంటోంది అని నివేదిక తెలిపింది. 30 ఏళ్ల వయసు దాటిన వారి నిరుద్యోగిత రేటు బగా పడిపోయింది. ఈ వయసుల వారు అవకాశం ఉన్న ఏదొక ఉపాధిని వెతుక్కుని పనులు చేస్తుండటం వల్ల ఈ వయసుల వారి నిరుద్యోగిత రేటు 2.5 శాతానికి పడిపోయింది. ఇండియాలో నిరుద్యోగిత రేటు 2019 డిసెంబర్‌లో 7.7 శాతానికి పెరిగిందని, నవంబర్‌లో 7.4 శాతం ఉండా నెలరోజుల వ్యవధిలో 0.3 శాతం పెరిగినట్టు నివేదిక తెలిపింది.


Next Story

Most Viewed