- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాల్ దర్వాజా బోనాలు.. ఆ పనులు వెంటనే చేపట్టండి
దిశ, చార్మినార్ : తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన లాల్ దర్వాజా బోనాల జాతర ఉత్సవాలకు అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని ఆలయ చైర్మన్ కె.వెంకటేష్ కోరారు. ఆషాడ మాస బోనాల జాతరను పురస్కరించుకుని శుక్రవారం జూబ్లీహిల్స్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వెంకటేష్ మాట్లాడారు.
గత రెండు సంవత్సరాలుగా ఆలయం సమీపంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్ట లేదనన్నారు. 2019 జూన్ నెలలో జరిగిన బోనాల సందర్భంగా నిర్వహించిన అభివృద్ధి పనులు తప్ప ఇంతవరకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేదని మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే నెలలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాలలోపు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కె.విష్ణు గౌడ్, కోశాధికారి జి.అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.