విషాదం.. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

by Shyam |
Man suicide
X

దిశ, స్టేషన్‌ ఘన్‌పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని నస్కల్ – వంగాలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జోగు అనిల్(27) అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన జోగు అనిల్ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement
Next Story

Most Viewed