- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, గజ్వేల్: అత్తింటి వేధింపులు భరించలేక ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ములుగు మండలం బండ మైలారం లో చోటుచేసుకుంది. ములుగు ఎస్సై రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం గుండ్లు మ్యాచునూర్ సంగారెడ్డి జిల్లాకు చెందిన నర్సింహా గౌడ్ కు ఇద్దరు సంతానం తన పెద్ద కూతురు ప్రసన్న (26) ములుగు మండలంలోని బడ మైలారం తిగుల్ల బాలకృష్ణకు ఇచ్చి 6 సంవత్సరం క్రితం వివాహం చేశారు. ప్రసన్న గృహిణి అయితే పెళ్లి జరిగి ఆరు సంవత్సరాలు అయినా, పిల్లలు లేరంటూ భర్తతో పాటు అత్త ఇందిరమ్మ, మామ యాద గౌడ్, తరచూ మానసికంగా వేధిస్తుండేవారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తన తమ్ముడు సాయి కిరణ్ గౌడ్ ఈ విషయంపై తన భావను మందలించినా అదే విధంగా గొడవ పడటం తో అక్కకు అర ఎకరం భూమిని ఇచ్చారు.
అయినా అత్త, మామ, భర్త అదేవిధంగా వేధించారు. ఇక ఈ విషయం తెలుసుకొని శనివారం అక్కను తీసుకురావడానికి సాయికుమార్ వెళ్లాడు. అయితే అప్పటికే ఉరివేసుకొని ఉండడంతో వెంటనే ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. అత్త, మామ,భర్త, పై అనుమానం ఉందని ప్రసన్న తమ్ముడు సాయి కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.