- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ప్రధాని కీలక నిర్ణయం.. డిసెంబర్ చివరలో లాక్‌డౌన్!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. బ్రిటన్‌లో శుక్రవారం ఒక్కరోజే 93,045 కేసులు నమోదయ్యాయి. దీంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్కడ ఇండోర్ మీటింగ్స్, పబ్స్, రెస్టారెంట్స్‌పై ఆంక్షలు విధించారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.
ఇదిలా ఉండగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఈ నెల చివర్లో రెండు వారాల పాటు సడలింపులతో కూడిన లాక్‌డౌన్ విధించేందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్కడి మీడియా తమ కథనాల్లో పేర్కొంది.