యూకే నాణేలపై మహాత్మా గాంధీ చిత్రం

by  |
యూకే నాణేలపై మహాత్మా గాంధీ చిత్రం
X

లండన్: భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు, జాతిపిత మహత్మా గాంధీ జ్ఞాపకార్థం యూకే ప్రభుత్వం ఆయన చిత్రంతో నాణేలను విడుదల చేయడానికి యోచిస్తున్నది. నల్లజాతీయులు, ఆసియవాసులు, ఇతరమైనార్టీ జాతుల సేవలపై చర్చ పెరుగుతున్న నేపథ్యంలో యూకే ఈ యోచన చేస్తున్నదని తెలిసింది.

ఈ వర్గాల సేవలను గుర్తించాలని రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ(ఆర్ఎంఏసీ)కి బ్రిటిష్ ఫైనాన్స్ మినిస్టర్ రిషి సునాక్ లేఖ రాసినట్టు యూకే ట్రెజరీ వెల్లడించింది. గాంధీ సేవలను కొనియాడుతూ నాణేన్ని విడుదల చేయాలని ఆర్ఎంఏసీ భావిస్తున్నట్టు ఆ ట్రెజరీ పేర్కొంది. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో ప్రపంచవ్యాప్తంగా చరిత్ర, వలసవాదం, జాతివివక్షపై చర్చ విస్తృతమైంది. మైనార్టీ జాతుల సాధికారతకు అనేక సంస్థలు ముందుకొస్తుండటం గమనార్హం.



Next Story