- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పరీక్షలు రద్దవ్వలేదు: ఆదిమూలపు సురేష్
దిశ ఏపీ బ్యూరో: సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్నట్టుగా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) పరీక్షలు రద్దు కాలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. యూజీ, పీజీ పరీక్షలపై వివిధ యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించడంతో పరీక్షలు రద్దయ్యాయంటూ పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. పదో తరగతి పరీక్షల తరహాలో యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలు కూడా రద్దు చేసినట్టు మెసేజ్‌లు పాస్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ, యూజీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంటుందని అన్నారు. అంతే కాకుండా ఒక్కో యూనివర్సిటీ ఒక్కో రకమైన విధానాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎలా చేయాలి.. రద్దు చేయాల్సి వస్తే ఏమి చేయాలి అన్న దానిపై పూర్తిగా కసరత్తు చేశామని అన్నారు. ఈ వివరాలు సీఎంకి వివరించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకూ యూజీ, పీజీ పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రకటించలేదని. స్పష్టం చేశారు. అలాగే ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం అకాడమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తామని ఆయన తెలిపారు.