లాక్‌డౌన్ ఎత్తేసే యోచనలేదు: ఠాక్రే

by  |
లాక్‌డౌన్ ఎత్తేసే యోచనలేదు: ఠాక్రే
X

ముంబయి: లాక్‌డౌన్ ఎత్తేయడానికి తొందరపడాల్సిన అవసరం లేదని, పాశ్చాత్య దేశాలు ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకుని మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నాయని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అందుకే ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తేసే యోచనలేదని, ఒక్కసారి ఎత్తేస్తే మళ్లీ విధించే అవసరం లేకుండా ఉండాలని తెలిపారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ నష్టపోతున్నదని, వెంటనే ఎత్తేయాలని చెబుతున్నారని పేర్కొన్నారు. వారి వ్యాఖ్యలతో అంగీకరిస్తున్నట్టు చెబుతూ.. కానీ, ప్రజలు వైరస్ సోకి మరణిస్తుంటే బాధ్యతను వాళ్లు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.

ఆర్థిక వ్యవస్థ కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధమేనా? అని ప్రశ్నిస్తూ తాను సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. తాను డొనాల్డ్ ట్రంప్ కాదని, ప్రజలు చస్తుంటే చూస్తూ ఊరుకోలేరని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కోసం లాక్‌డౌన్ ఎత్తేస్తే ప్రజలు మరణిస్తుంటే తర్వాత.. ఉపాధి, ఉద్యోగాలు, కంపెనీలుండి ఏం లాభమని అన్నారు. అన్ని ఆంక్షలను నెమ్మదిగా సడలించి లాక్‌డౌన్ ఎత్తేయడంపైనే తమ దృష్టి ఉన్నదని శివసేన మౌత్‌పీస్ సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలు భేష్‌గా ఉన్నాయని అన్నారు. చైనాలాగే తామూ 15 నుంచి 20 రోజుల్లో ఆస్పత్రులు నిర్మించామని వెల్లడించారు.


Next Story

Most Viewed