- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఘోరం.. ట్రాక్టర్ బోల్తాపడి అత్తాకోడలు మృతి
by Sumithra |

X
దిశ సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్‌పల్లి మధిర గ్రామం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి అత్తాకోడళ్లిద్దరూ మృతిచెందారు. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన తిప్పరబోయిన పోచయ్య కుటుంబ సభ్యులతో కలిసి ట్రాక్టర్‌లో వరి ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొస్తున్న క్రమంలో చెరువుకట్టపైకి రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పైన ఉన్న అత్తాకోడళ్లిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Next Story