మద్యం తాగారు.. ఉద్యోగం పోగొట్టుకున్నారు

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి రూరల్ మండలంలో ఇద్దరు వాలంటీర్లపై వేటు పడింది. ఈ నెల 29నా వారిద్దరూ మంగళం బీటీ కాలనీలోని సచివాలయంలో మద్యం తాగారు. ఈ వ్యవహారాన్ని తోటి సిబ్బంది వీడియో తీసి సోషయల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ కావడంతో పంచాయతీ కార్యదర్శి సురేందర్ రావు ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెడ్డప్ప, ఢిల్లీ బాబు అనే వాలంటీర్లను విధులను నుంచి తొలగించారు.

Advertisement