జీహెచ్ఎంసీ ఎదుట ఇద్దరు ఆత్మహత్యాయత్నం

by Shyam |   ( Updated:2021-07-17 06:30:09.0  )
Suicide Attempt
X

దిశ, సిటీబ్యూరో : నెలవారి మామూళ్లు ఇవ్వలేమనే కారణంతో ఒకరు, తనకు సెలవులు ఇవ్వకుండా అన్ లిమిటెడ్‌గా పనులు చేయిస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట తమ కుటుంబ సభ్యులతో నిరసనగా దిగి, కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గోషామహల్ సర్కిల్ పరిధిలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా, స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమాగౌరీ నెలకు రూ.6 వేలు మామూలు ఇవ్వమని వేధిస్తున్నారని, డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో విధుల నుంచి తొలగించారని శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ యాదవ్ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ ఆయన కుటుంబ సభ్యులతో సహా జీహెచ్ఎంసీ ముందు బైఠాయించారు.

రమేష్ యాదవ్‌తోపాటు మరో కార్మికుడు కూడా ఆందోళనలో పాల్గొన్నాడు. ఆరోగ్యం బాగోలేదన్నా వినిపించుకోకుండా తనతో అన్ లిమిటెడ్‌గా మెడికల్ ఆఫీసర్ ఉమా గౌరీ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆమె వేధింపులు భరించలేమని ఒంటిపై కిరోసిన్ పోసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే విధుల్లో ఉన్న సెక్యూరిటీ వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed