అదుపుతప్పి కారు బోల్తా..

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హైవేపై వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద నార్కట్ పల్లి హైవే‌పై మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. హైవేపై వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

బాధితులు హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement