- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిడుగు పాటు..ఆ కుటుంబాలకు దిక్కెవరు!
దిశ, వరంగల్
అకాల వర్షాలు రాష్ట్రంలోని ప్రజల జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి.మొన్నటి దాకా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చేతికందకుండా చేసి, వారిని నిండా ముంచిన వర్షాలకు పిడుగు పాటులు కూడా తోడయ్యాయి. కరోనా నేపథ్యంలో ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్న నిరుపేదలపై ప్రకృతి ప్రకోపం చూపింది.ఆదివారం వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు తోడు పడిన పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన వరంగల్ రూరల్ చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లింగాపురం గ్రామంలో పని కోసం వెళ్లిన ముటిక కుమారస్వామి, అజ్మీరా రామస్వామి అనే ఇద్దరు వ్యక్తులు పిడుగు పాటుకు మృతి చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరు మరణించడంతో వీరిపై ఆధారపడి బతుకీడుస్తున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రకృతి ప్రకోపానికి బలైన వారి కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, మృత దేహాల వద్ద కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.