బావిలో మరో రెండు మృతదేహాలు.. రంగంలోకి కమిషనర్

దిశ, వరంగల్: క్రైమ్ సినిమాను తలపించేలా వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామ బావిలో మృతదేహాలు బయటపడుతున్నాయి. గురువారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వలస కుటుంబం బావిలో మృతదేహాలుగా కనిపించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం తెల్లవారుజామున మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన కొందరు గ్రామస్తులకు మరో మృతదేహం బావిలో తేలియాడుతుండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామంలో మొత్తంగా ఏడుగురు వలస కూలీలు ఉండటంతో గత కొన్ని రోజులుగా బీహార్‌‌కు చెందిన ఇద్దరు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు గజ ఈతగాళ్లో బావిలో వెతికించగా మరో రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. దీంతో మొత్తం నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకూ ఏడు మృతదేహాలు లభ్యం కాగా ఇంకేమైనా శవాలు ఉన్నాయా..? అనే అనుమానంతో పోలీసులు మళ్లీ బావిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతులు అంతా పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్టానికి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement