ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

by Mahesh |
omicran
X

దిశ, వెబ్‌‌డెస్క్ : ఒమిక్రాన్ విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో మరో రెండు కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెంది ఓ వ్యక్తికి, అలాగే అనంతపురంలోని మరో వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది.

ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి తన స్వస్థలం అయిన ఒంగోలుకు ఓ వ్యక్తి వచ్చారు. దీంతో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అనంతరం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిగ్రాన్‌గా తేలింది. అలాగే యూకే నుంచి మరో వ్యక్తి అనంతపురం రాగా, అతనికి కూడా ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

Advertisement

Next Story