- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెరువులో పడి ఇద్దరు వలస కూలీలు మృతి

X
దిశ, పటాన్‌చెరు: బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఐలపూర్ తండా సమీపంలో చోటు చేసుకుంది.
అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ చిన్న తండాలో నలుగురు యువతులు (వలస కూలీలు) నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలోనే బట్టలు ఉతకడానికి దగ్గరలోని చెరువులోకి వెళ్లారు. ఆ తర్వాత చెరువులో స్నానం చేసే ప్రయత్నంలో నీటిలో మునిగి మృతి చెందారు. మృతులు మహబూబ్‌నగర్‌కు చెందిన వలస కూలీలు చిట్టి(20), వరలక్ష్మీగా (19)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Next Story