విషయం తెలిసిందని.. బలవన్మరణానికి పాల్పడ్డారు

by Shyam |   ( Updated:2020-11-13 07:25:54.0  )

దిశ, నిజామాబాద్: చెట్టుకు ఉరి వేసుకుని ఇద్దరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని శివారులో బాలనర్సు(38), ప్రేమలత(35) అనే వీరిద్దరూ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. మాచారెడ్డికి చెందిన వీరిద్దరూ వేరువేరు కుటుంబాలకు చెందిన వారు కాగా వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగింది. బాలనర్సుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రేమలతకు భర్త, కుమారుడు ఉన్నారు. గత కొంత కాలంగా వీరి మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధ వ్యవహారం గురించి రెండు కుటుంబాలకు తెలియడంతో వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story