మృత్యు శకటాలుగా ఆర్టీసీ బస్సులు.. ఇద్దరు మృతి

by srinivas |
మృత్యు శకటాలుగా ఆర్టీసీ బస్సులు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. ప్రభుత్వ రవాణా సర్వీసుల్లోనే మీ జర్నీ సుఖవంతంగా సాగుతుందని ఒకప్పుడు ప్రచారాలు దంచికొట్టేవారు. చెప్పిన విధంగానే నాడు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేది. కానీ, ఇటీవల ప్రమాదాలకు గురవుతున్న వాటిలో ఆర్టీసీ బస్సులే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు, ఓ గ్యాస్ లారీ ఢీ కొట్టుకున్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా, ఆర్టీసీని సిబ్బంది కొరత వెంటాడుతోందని, ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ అవడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఉద్యోగ సంఘాల లీడర్లు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed