- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దావత్ పార్టీలో విషాదం.. కాలువలో పడి ఇద్దరు మృతి

X
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని రొంపిచర్ల మండలం తంగళ్లపల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి ప్రాణాపాయం తప్పింది. కాల్వ ఒడ్డున పార్టీ చేసుకుంటూ నీళ్లలో ఓ వ్యక్తి పడిపోగా.. అతన్ని కాపాడేందుకు వెళ్లి మరో నలుగురు వ్యక్తులు మునిగిపోయారు.
అందులో రామాంజనేయులు (40), శ్రీను (40) అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. నీటిలో మునిగిపోతున్న మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. బాధితులను వెలవవారి పాలెంనకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story