- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అప్పటివరకు సంతోషం.. అంతలోనే ‘బతుకమ్మ’ మిగిల్చిన విషాదం
దిశ, కల్లూరు : ఉమ్మం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, రఘునాథ్ బంజార గ్రామంలో బతుకమ్మ సంబురాల్లో అపశృతి చోటుచేసుకుంది. గ్రామంలో సంతోషంగా బతుకమ్మ సంబురాలు ముగించుకుని నిమజ్జన కోసం NSP కాలవ దగ్గరకి వెళ్లగా అప్పటివరకు సంతోషంగా గడిపిన వారి ఇంట్లో విషాదం నెలకొంది.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మం పాటి మధులత (25) తండ్రి బుజ్జి (డీలర్) బతుకమ్మను కాలువలో నిమజ్జనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయారు. తక్షణమే ఆమెను కాపాడేందుకు ముగ్గురు యువకులు కాల్వలోకి దిగగా, పసుపులేటి శివ (25) అనే వ్యక్తి గల్లంతయ్యాడు.
యువతి మధులత అప్పటికే మృతిచెందగా, ఆమె డెడ్ బాడీ లభ్యమైంది. మధులతను కాపాడేందుకు కాల్వలోకి దిగిన వారిలో శివ ఒకరు. ఆ వెంటనే అతని గురించి గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ లభ్యం కాలేదు. కానీ, చాలా సేపు ప్రయత్నం తర్వాత శివ డెడ్‌బాడీని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.