- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పిడుగుపాటుకు ఇద్దరు మృతి

X
దిశ, మహబూబ్ నగర్: పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున జిల్లాలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మహబూబ్ నగర్ మండల పరిధిలోని ఓబులయ్యపల్లి తండాలో వ్యవసాయ పొలం దగ్గర పిడుగు పడి తుక్యానాయక్ అనే రైతు మృత్యువాత పడ్డారు. అలాగే వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగపేట గ్రామ శివారులో కూడా పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి చెందాడు. మృతుడు కొంకన్నోని పల్లె గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు.
Next Story