- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తిరుమలలో ఇద్దరిపై చిరుత దాడి.. భయాందోళనలో భక్తులు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమలలో మరోసారి పులి సంచారం కలకలం సృష్టించింది. తిరుమల ఘాట్ రోడ్డులో గత కొంతకాలంగా సంచరిస్తూ భక్తులను భయపెడుతున్న చిరుత ఈసారి ఏకంగా దాడి చేయడం సంచలనంగా మారింది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
వివరాల ప్రకారం.. ఎఫ్ఎంఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణ బైక్‌పై రెండో ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తుండగా వినాయకుడి గుడి దాటిన తర్వాత చిరుత వారిపై దాడి చేసింది. చిరుత దాడిలో వారిద్దరూ స్పల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో వీరు కనిపించడంతో దాడి చేసినట్టు సమాచారం. దాడికి గురైన వారిద్దరినీ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Next Story