అనంతపురంలో భయానకంగా శవాలు 

by srinivas |
అనంతపురంలో భయానకంగా శవాలు 
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో మంగళవారం ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలోని బెల్లపు కొండ దగ్గర గుర్తు తెలియని మహిళ, పురుషుడు కలిసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

వీరు హీరో గ్లామర్ AP02 AY 1467 నెంబర్ గల ద్విచక్ర వాహనంలో వచ్చారు. ఆ బైక్ ను ప్రక్కన పెట్టి ఇరువురు కలిసి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి శరీర భాగాలు విడివిడిగా పడి ఉన్నాయి. వీరి శవాలు భయంగొల్పేలా పడి ఉండటంతో చూసినవారు భయాందోళనకు గురయ్యారు. హిందూపూర్ రైల్వే పోలీసులకు గ్యాంగ్ మెన్ సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story