- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సిద్దిపేట జిల్లాలో ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

X
దిశ, హుస్నాబాద్: ఆన్‌లైన్‌లో తమ పేరు లేదని ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలకు చెందిన రైతులు బొప్పనపల్లి శ్రీహరి, బొప్పనపల్లి రమేష్ ఇరువురు మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు కిరోసిన్ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆన్‌లైన్‌లో పేరు రావడం లేదని పలుమార్లు అధికారులకు ధరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. దీంతో రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ బాపురెడ్డి స్పందించి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
Next Story