- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బుర్కపల్లిలో విషాదం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
by Aamani |

X
దిశ, బజార్ హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుర్కపల్లి గ్రామానికి చెందిన బనియ గరన్ సింగ్, బనియ ఆశాభాయి రోజులాగే పనుల నిమిత్తం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. పొలంలో సోయాబీన్ కోస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో దగ్గరలోని చెట్టు కిందకు వెళ్ళారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడి గరన్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన ఆశాభాయిని రిమ్స్‌కి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story