సోపోర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఓ పౌరుడు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని సోపోర్ లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. భద్రతా దళాలు చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు తిరిగి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఓ పౌరుడు మృతి చెందినట్లు తెలిసింది.

Advertisement