బాసరలో రెండు పాజిటివ్ కేసులు

by Aamani |   ( Updated:2020-08-18 11:21:09.0  )
బాసరలో రెండు పాజిటివ్ కేసులు
X

దిశ, బాసర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో గతంలో మూడు కేసులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. బాసరలో ఎనిమిది మందికి కరోనా టెస్టుల చేయగా, ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. గతంలో ముగ్గురితో పాటు మరో ఇద్దరికి పాజిటివ్ రావడంతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు, పాలకులు ఇప్పటికైనా స్పందించి ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.



Next Story

Most Viewed