నిర్మల్‌లో మరో రెండు కంటైన్‌మెంట్‌ జోన్లు ఎత్తివేత

by Aamani |

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో మరో రెండు కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలను ఎత్తివేశామని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. జిల్లాలో 16 కంటైన్‌మెంట్ జోన్లు గుర్తించగా శుక్రవారం ఏడు ఎత్తి వేయగా, శనివారం కస్బపాన్ గల్లి, బుధవార్‌పేట్ ప్రాంతాల్లో కూడా ఆంక్షలను ఎత్తివేశారు. ప్రజలు బయటకు రాకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణకు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ పిలుపునిచ్చారు.

Tags: Musharraf Farooqi, easing, containment zones, nirmal



Next Story

Most Viewed