- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దారుణానికి ఒడిగట్టిన కానిస్టేబుల్
by Sumithra |

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో ఓ కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. ఓకే యూనిట్‌కు చెందిన ఇద్దరు బీఎస్‌ఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన నార్త్ దినజ్‌పూర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మాల్లాఖండ్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ 146వ బెటాలియన్ కానిస్టేబుల్ ఉత్తమ్ సూత్రధార్ అదే బెటాలియన్ కు చెందిన సీఐ మహిందర్ సింగ్ భట్టి, కానిస్టేబుల్ అనుజ్ కుమార్‌పై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డవారు అక్కడికక్కడే మృతి చెందారని రాయ్ గంజ్ ఎస్పీ తెలిపారు. ఈ ఘటన నిందితుడు ఉత్తమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story