- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pawan Kalyan : 'హరిహర వీరమల్లు' లో బాలీవుడ్ స్టార్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే
దిశ, వెబ్‌డెస్క్: దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వకీల్ సాబ్ (Vakeel saab) చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ ప్రస్తుతం ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ లోను, క్రిష్ నిర్మిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రంలోనూ నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండస్ (Jacqueline Fernandez) ఒక కీలక పాత్రలో చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై నిర్మాత ఏఎం రత్నం ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు.
‘హరిహర వీరమల్లు’ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారని.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, (Arjun Rampal) హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండస్ (Jacqueline Fernandez) ఇద్దరు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో ఔరంగజేబ్ పాత్రలో అర్జున్ రాంపాల్ కనిపించనుండగా, 17వ శతాబ్ధపు మొఘల్ రాణిగా జాక్వెలిన్ కనిపించనునట్లు సమాచారం. ప్రస్తుతం 50 శాతం షూటింగ్ పూర్తీ అయ్యిందని, లాక్ డౌన్ తర్వాత మొదలయ్యే షూటింగ్ లో వీరు పాల్గొననున్నట్లు ఏఎం రత్నం తెలిపారు. ఇక ఈ సినిమాలో పవన్ నటన అద్భుతంగా ఉంటుందని, ఆయన అభిమానులు కాలర్ ఎత్తుకొని తిరిగేలా ఉంటుందని తెలిపారు.