- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెండింగ్‌లో వ్యాక్సిన్ మూవీ టైటిల్స్
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇండియాలోనూ 45ప్లస్ వారితో పాటు, సూపర్ స్ప్రెడర్స్‌కు టీకాలు ఇస్తుండగా, జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు వేస్తున్న విషయం తెలిసిందే. ఏ టాపిక్‌ను కూడా వదలని మీమర్స్ టీకా డ్రైవ్‌పై ఇప్పటికే బోలెడు మీమ్స్ సృష్టించారు. తాజాగా బాలీవుడ్ సినిమా టైటిల్స్‌కు తమ సృజనాత్మక జోడించి అమేజింగ్ వ్యాక్సిన్ మూవీ నేమ్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో #VaccineMovieTitles హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.
18 ప్లస్ వయసు వారికి కొవిడ్ -19 టీకా డ్రైవ్ మే 1న ప్రారంభమైనప్పటికీ, చాలా మంది టీకా పొందేందుకు స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి కష్టపడ్డ విషయం తెలిసిందే. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ స్లాట్స్ పోర్టల్‌లో ఖాళీగా ఉండటం లేదు. వెబ్‌సైట్‌లో నమోదు ప్రక్రియ, ఓటీపీ, అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వెబ్‌సైట్‌లో గంటల తరబడి వేచిచూసినా, అలర్ట్స్ ఫాలో అవుతున్నా, టీకా స్లాట్స్ బుక్ చేసుకోలేకపోయారు.
వ్యాక్సిన్ పొందడానికి నిరంతర పోరాటం చేస్తున్న నెటిజన్లు, ఆ పరిస్థితిని హైలైట్ చేయడానికి మీమ్స్ జోకుల వైపు మొగ్గు చూపగా, ఈ సందర్భంగా ‘కొవిన్’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఈ క్రమంలోనే ‘నేనెప్పుడు బోర్ కొట్టినా ఇదివరకు నా ఇన్‌స్టా తరుచుగా ఓపెన్ చేసేవాడిని .. ఇప్పుడు కొవిన్ చెక్ చేస్తున్నా’ ‘హృదయం ఏదీ కోరుకుంటుందో అది కొవిన్ దొరకదని చెబుతోంది’ వంటి హిలేరియస్ మీమ్స్ ట్రెండ్ కాగా, ఇప్పుడు #VaccineMovieTitles హ్యాష్‌ట్రెండ్ మొదలైంది. ‘జబ్ వి మెట్’ (జబ్ అంటే ఇంజెక్షన్), మే వ్యాక్సిన్ కి దివానీ హూ, కబీ కోవిషీల్డ్ కబీ కోవ్యాగ్జిన్, జబ్ నే బనా ది జోడి, డోస్-తానా(దోస్తానా), హాఫ్ వ్యాక్సినేటెడ్ (హాఫ్ గర్ల్‌ఫ్రెండ్), హమ్ వ్యాక్సిన్ లే చుకే సనమ్, 2 మోర్ షాట్స్ ప్లీజ్, డోస్-2 : ద కన్‌క్లూజన్ (బాహుబలి-2), వ్యాక్సిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ (షాదీ కి సైడ్ ఎఫెక్ట్స్), ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ వ్యాక్సిన్ (ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే) వంటి టైటిల్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.