- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి ట్విట్టర్ బంపర్ ఆఫర్: బగ్ పట్టండి.. లక్షలు గెలవండి
దిశ, ఫీచర్స్: ట్విట్టర్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ఇటీవలే ప్రకటించింది. అయితే ఈసారి ‘సెక్యూరిటీ బయాసెస్’ వెలికితీసి, పరిష్కరించడానికి బగ్ బంటీ హంటర్స్, రీసెర్చర్స్‌కు వందలాది డాలర్లు చెల్లించే బదులు, సాధారణ వినియోగదారులకు కూడా నగదు ‘బహుమతి’ అందించాలని ట్విట్టర్ నిర్ణయించింది. ఇందుకోసం తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథంలో బగ్‌ను గుర్తించాలని యూజర్లకు సవాల్ విసిరింది.
ట్విట్టర్ 2018లో ఇమేజ్ క్రాపింగ్ అల్గారిథం రూపొందించింది. అయితే ట్విట్టర్ ఆశించినంతగా ఇది పనిచేయకపోగా, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. నలుపు, తెలుపు రంగుల్లోని మనుషులను గుర్తించడంలో ట్రాన్స్‌పరన్సీ లేకపోవడం, మహిళల చెస్ట్, లెగ్స్ పార్ట్స్ మీద ఫొకస్ చేసే చిత్రాలు చూపడం వల్ల ఈ అల్గారిథాన్ని వ్యతిరేకించారు. అయితే అల్గారిథమ్ బేస్డ్‌గా పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లోని లోపాలను గుర్తించడానికి ట్విట్టర్ ఈ పోటీని ప్రకటించింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన కోడ్‌ను యూజర్లకు అందుబాటులో ఉంచింది.
యూజర్లను ప్రోత్సహించడం ద్వారా అల్గారిథాన్ని సరిచేయాలని ట్విట్టర్ భావిస్తోంది. బగ్ బౌంటీ ప్రోగ్రాంను ప్రవేశపెట్టడం ట్విటర్‌కి ఇదే తొలిసారి కాగా హ్యాకర్ కన్వెన్షన్ ఈవెంట్‌ను డెఫ్ కాన్ ఏఐ (DEF CON AI) విలేజ్‌లో ఈ పోటీ జరగనుంది. ఆగస్టు 8న విజేతలను ప్రకటించనుండగా, ఈ పోటీలో పాల్గొనే ఔత్సాహికులకు 2021 ఆగస్టు 6 వరకు ఎంట్రీలు పంపించవచ్చు. విజేతలుగా మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచిన వ్యక్తులకు వరుసగా $ 3,500 (సుమారు రూ. 2,60,242), $ 1,000 (సుమారు రూ. 74,369), $ 500 (సుమారు రూ. 37,184) నగదు బహుమతులను అందిస్తారు.
మెషీన్‌లోని బయాస్‌ను కనుగొనడం కొంచెం కష్టమే. కొన్ని సార్లు కంపెనీలు అవి కనుగొనలేకపోవచ్చు. అలాంటప్పుడు యూజర్లకు హాని కలిగే ప్రమాదం ఉంది. అలాగే హ్యాక్‌కు గురికావచ్చు. అందుకే దీన్ని పరిష్కరించేందుకు ఈ పోటీని తీసుకొచ్చామని హ్యాకర్లు, యూజర్లకు ఇదో సవాల్ లాంటిదని ట్విట్టర్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.