- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘భర్తను తప్పించేందుకే ఎర్రబెల్లిపై ఎంపీపీ ఆరోపణలు’
by Anukaran |

X
దిశ, కమలాపూర్: ఎంపీపీ తడక రాణి తన భర్త శ్రీకాంత్‌ను కేసు నుంచి తప్పించడానికి పథకం ప్రకారమే ముందస్తుగా రచ్చ చేశారని కమలాపూర్ టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో జరిగిన సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారమే అందరిని పిలిచారని, ఎవరిని అవమాన పరచలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఓడిపోతామనే భయంతోనే బీజేపీ నాయకులు ఇటువంటి చిల్లర పనులకు ఒడిగడుతున్నారని విమర్శించారు. మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం చేపట్టిన కార్యక్రమానికి విచ్చేసిన మహిళా లోకాన్ని చూసి ఓర్వలేక నానా రచ్చ చేశారని దుయ్య బట్టారు. తన భర్త టీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేశాడని.. ఆ కేసు నుంచి తప్పించడానికి.. పథకం ప్రకారమే సమావేశానికి ఆలస్యంగా వచ్చి మంత్రి ఎర్రబెల్లిపై ఈ ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు.
Next Story