- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటినుంచే ఇంటర్ పరీక్షలు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే పన్నెండో తరగతి పరీక్షలను ఓపెన్ బుక్ ఫార్మేట్‌లో నిర్వహించాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. జూన్ నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ప్రశ్న పత్రాలు, ఆన్సర్ కీస్ జూన్ 1 నుంచి 5 వరకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటికి జవాబులు రాసిన పత్రాలను తాము ప్రశ్నాపత్రాలను తీసుకున్న తేదీ నుంచి ఐదు రోజుల్లోగా సంబంధిత పరీక్షా కేంద్రాలకు సమర్పించాలని స్పష్టం చేశారు. అనగా.. విద్యార్థులు జూన్ 1 న ప్రశ్నాపత్రం తీసుకుంటే.. వాటికి సమాధానాలు రాసి జూన్ 5 లోపు అందించవల్సి ఉంటుంది.
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేస్తోందని అధికారులు తెలుపుతున్నారు. ఇక ఈ ప్రశ్నాపత్రాలను బోర్డు పంపిన పరీక్షాకేంద్రాలకు మాత్రమే పంపాలి.. ఒక వేళ వాటిని పోస్ట్ ద్వారా పంపితే వాటిని రద్దుచేయడం జరుగుతుందని స్పష్టం చేసింది. విద్యార్థులందరూ పరీక్షలకు సన్నద్ధం అయ్యి, ఆన్ లైన్లో ప్రశ్నాపత్రాల కోసం అప్లై చేసుకోవాలని ఛత్తీస్‌గఢ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కోరింది.